తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని గాజులరామారం డివిజన్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించారు.ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ కార్యదర్శి మధుబాబు చికిలే మాట్లాడుతూ తెలంగాణ తొలి మరియు మలి దశ ఉద్యమాలకు దిశా నిర్దేశనం చేసిన సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ అని చెప్పారు.కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ బల్వంత్ కుమార్ యాదవ్,సందీప్ బల్లెం ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.