అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మరికల్ శాఖ ఆధ్వర్యంలో 78వ జాతీయ విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది.
నమస్తే భరత్,, 9/7/2026/ నారాయణపేట జిల్లా, మక్తల్
ఈ సందర్భంగా మణికంఠ జూనియర్ కళాశాలలో విద్యార్థి జెండాను ఆవిష్కరించి, విద్యార్థులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆశయాలు, లక్ష్యాలు మరియు విద్యార్థి సమాజం పట్ల ఏబీవీపీ చేస్తున్న సేవల గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా కన్వీనర్ నరేష్ గారు ముఖ్య అతిథిగా శ్రీ భారతి హై స్కూల్ లక్ష్మీకాంత్ రెడ్డి సార్ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మరికల్ నగర ఉపాధ్యక్షులు సురీటీ బన్నీ, మరికల్ ఏబీవీపీ నాయకులు వసంత్ కుమార్, రాకేష్, గణేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.