NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:36 am Posted by : NAMASTHE BHARAT

ఖానాపురంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ఖానాపురంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

సర్పంచ్ దాసరి రమేష్

ఖానాపురం సెప్టెంబర్ 17 (నమస్తే భారత్ ) :
ఖానాపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం (విలీన దినోత్సవం) వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.

సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ, “నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన సెప్టెంబర్ 17 చరిత్రలో మరువలేని రోజు. తెలంగాణ విలీనం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి” అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటుగా గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, చలిగంటి మల్లికార్జున్, అజహర్, మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.