సాంప్రదాయాలు, సంస్కృతిని చాటుతూ జమ్మికుంట తండాలో ఘనంగా తీజ్ పండుగ ఉత్సవాలు

నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బోట్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని జమ్మికుంట తండాలో తీజ్ పండుగ ఉత్సవాలను సాంస్కృతిక సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బానోత్ విజయకౌర్ కిషన్ సింగ్, సేవా సేన సమితి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయంలోని మేరమ్మ యాడికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పండుగలో భాగంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 600 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
తీజ్ పండుగను ప్రతి సంవత్సరం.సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ద్వారా గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.