పిఆర్టీయూ–టీఎస్ జిల్లా నూతన కార్యవర్గంలో మరిపెడ మండల ఉపాధ్యాయులకు సముచిత స్థానం


పి.సరోజ
జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు
గుర్రం వెంకన్న
జిల్లా ఉపాధ్యక్షులు
వేల్పుల వెంకటయ్య
జిల్లా కార్యదర్శి
నమస్తే భారత్ :-మరిపెడ
పిఆర్టీయూ టి ఎస్ మహబూబాబాద్ జిల్లా కమిటీలో మరిపెడ మండలంలోని ఉపాధ్యాయులకు చోటు దక్కినట్లు పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి, లింగాల మహేష్ గౌడ్ ఉపాధ్యాయులకు చోటు దక్కింది. జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా పి.సరోజ , జిల్లా ఉపాధ్యక్షులు గా గుర్రం వెంకన్న గౌడ్, జిల్లా కార్యదర్శిగా వేల్పుల వెంకటయ్య ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేస్తామని తెలిపారు. మా ఎంపికకు కు సహకరించిన మరిపెడ మండల శాఖకు,జిల్లా శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారిని అభినందించిన వారిలో పిఆర్టీయూ బాధ్యులు రాంమోహన్,లింగయ్య,యాకయ్య,దత్తప్రసాద్,కృష్ణారెడ్డి,రవి,వెంకన్న,శ్రీను,విజయ్,విశ్వనాథం,రజిత,కవిత,రమ తదితరులు పాల్గొన్నారు .