NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 11:00 pm Posted by : NAMASTHE BHARAT

తానంచర్ల ఆనకట్ట నిర్మాణం చేసి వెంటనే రైతంగానికి సాగునీరు అందించాలి

తానంచర్ల ఆనకట్ట నిర్మాణం చేసి వెంటనే రైతంగానికి సాగునీరు అందించాలి

వరద కాలువ పూర్తయితే ఐదు మండలాలు 20వేల ఎకరాల సాగు

ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య మరిపెడ మండల పార్టీ కార్యదర్శి గుండ గాని మధుసూదన్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తారంచర్ల ఆనకట్ట నిర్మాణం చేసి వెంటనే రైతంగానికి సాగునీరు అందించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య సిపిఎం మండల కార్యదర్శి గుండా గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సెప్టెంబర్ 20 ఆదివారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మరిపెడ మండలం తానంచర్ల ఆనకట్టను సందర్శించి స్థానికంగా ఉన్న రైతాంగాన్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో భారీ వర్షాలకు ఆనకట్ట తెగిపోయింది నాటి నుండి రైతన్ననికి నీరు లేక పంటలు పండక భూగర్భ జలాలు ఎండిపోయి తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని వారన్నారు అదేవిధంగా కుడి ఎడమ కాలువలు చెట్లు మొలిచి పాడైపోయినాయి దీంతో పాలేరు వాగు పై ఉన్న ఆనకట్ట లో నీరు నిలువక కృష్ణా నదిలో కలుస్తుంది ఆనకట్ట పనులు పూర్తి చేస్తే కుడి ఎడమ కాలువ ద్వారా 20,000 ఎకరాలు సాగు అవుతుంది మరో 5000 ఎకరాలకు భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు 16 ఏళ్ల క్రితం 20 కోట్ల నిధులు మంజూరు చేసి భూ సేకరణ సంబంధించిన రైతులకు నష్టపరిహారం చెల్లించారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు.పట్టించకపోవడంతో రైతంగం తీవ్ర అవస్థలు పడుతున్నారని ఎల్ నీ నో ప్రభావంతో మరింత భూగర్భ జలాలు అడుగంటి కరువు చాయలు ఏర్పడ్డాయని వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం ఆనకట్ట పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి ఆందోళన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు ఆనకట్ట సందర్శన కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్న తాటికొండ అనంత చారి అల్లి శ్రీనివాస్ రెడ్డి షేక్ షరీఫ్ బాసు నాయక్ తాడూరి వీరింకులు నలబోలు లక్ష్మారెడ్డి స్థానిక రైతులు భూక్య నాగు భూక్యా వెంకన్న మల్సూరు అజ్మీర గోపి తదితరులు పాల్గొన్నారు