NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:57 pm Posted by : NAMASTHE BHARAT

పాకాల సరస్సుకు దేవాదుల జలాలు అందించడం హర్షణీయం  యువజన కాంగ్రెస్ నాయకుడు  ముఖేష్

పాకాల సరస్సుకు దేవాదుల జలాలు అందించడం హర్షణీయం

యువజన కాంగ్రెస్ నాయకుడు ముఖేష్

ఖానాపురం జులై22 (నమస్తే భారత్ ) :

ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో దేవాదుల పైప్‌లైన్ ద్వారా పాకాల సరస్సుకు నీటిని విడుదల చేయడం హర్షణీయమని వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు శాఖమూరి ముఖేష్ (అబ్బులు) అన్నారు. ఈ సందర్భంగా పాకాల రైతాంగం తరపున ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న వారం రోజుల పాటు ఇదే విధంగా దేవాదుల పైప్‌లైన్ ద్వారా పాకాల సరస్సులోకి నీరు విడుదలైతే, నీటిమట్టం 20 నుంచి 22 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు.పాకాల ఆయకట్టు పరిధిలోని రైతులందరూ సమృద్ధిగా పంటలు పండించి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాకాల సరస్సుకు నిరంతరం నీటిని అందించేలా చర్యలు కొనసాగాలని ఆయన కోరారు.