NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 3:49 pm Posted by : NAMASTHE BHARAT

కుత్బుల్లాపూర్ లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

కుత్బుల్లాపూర్ లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

యూఎస్ఎఫ్ఐ పిలుపునకు విశేష స్పందన.. కేంద్రం వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

-ఢిల్లీ జంతర్‌మంతర్ ఘటనపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించిన యూఎస్ఎఫ్ఐ

-నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

-ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

-ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపినట్లు వెల్లడి

-విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారంతో బంద్ ప్రశాంతంగా ముగిసినట్లు యూఎస్ఎఫ్ఐ ప్రకటన

-డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక

కుత్బుల్లాపూర్, జులై 24 ( నమస్తే భరత్ ); ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్ఎఫ్ఐ ఇచ్చిన పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్‌కు విశేషంగా సహకరించాయని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారని తెలిపారు. విద్యార్థులపై అణచివేత ధోరణిని నిరసిస్తూ, ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు ఈ బంద్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ప్రతినిధులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించి, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను విస్మరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నియోజకవర్గ, మండల, కళాశాల కమిటీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.