NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:30 pm Posted by : NAMASTHE BHARAT

విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు.
డివిజన్ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో 25 మంది విద్యార్థులతో లిటిల్ ఫ్లవర్ సోల్జర్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, వ్యాధుల సంక్రమణతో ప్రజలు ఇబ్బందులు పడ్డ తరుణంలో సోల్జర్స్ టీం ప్రజలకు అండగా నిలిచే సదుద్దేశంతో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ కరస్పాండెంట్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, యాజమాన్యం విద్యార్థులతో సోల్జర్స్ టీమ్ ను ఏర్పాటు చేసింది.ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే సోల్జర్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించి విపత్కర సమయాల్లో ఫోన్ చేయాల్సిన నంబర్ 9100100488.ను.ఆవిష్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు.విద్యార్థులు చదువుతోపాటు సమాజహిత కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అవసరమని తెలిపారు.ఆ దిశగా పాఠశాలల యాజమాన్యాలు,తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. నేటి తరంలో మానవత్వ విలువలు తగ్గుతున్నాయని, సంతానానికి విద్యతోపాటు విలువలు, సేవా దృక్పథం అలవడేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.లిటిల్ ఫ్లవర్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను సోల్జర్స్ టీమ్ గా ఏర్పాటు చేసి వారికి శిక్షణ అందించడం గర్వకారణమని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో పాఠశాలల్లో సోల్జర్స్ టీమ్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, ఎస్సై తోట మహేందర్ రెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్ధసాని సురేష్,ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, వైద్యుడు డాక్టర్ అలువాల విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు జాటోత్ హమ్యా నాయక్,మేకల కుమార్, గంజి విజయపాల్ రెడ్డి,మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, వికాస్,అభ్యాస్ పాఠశాలల కరస్పాండెంట్ లు తాళ్లపల్లి రమేష్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.