NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 9:17 am Posted by : NAMASTHE BHARAT

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో కూలి భూమి ఉపాధి పోరాటాలు

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో కూలి భూమి ఉపాధి పోరాటాలు

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీనివాస్

నమస్తే భారత్ :-మహబూబాబాద్

భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో మహబూబాబాద్ జిల్లాలో కూలి భూమి ఉపాధి పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు జూలై 4న శనివారం రోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొమరయ్య వర్ధంతి జరిగింది వర్ధంతి సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో పొందిన తొలి అమరుడు కొమరయ్య నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరత్వం తో తెలంగాణలో విప్లవ జ్వాలలు రగిలి బాంచన్ కాల్మొక్త దొర అన్న ప్రజలే తిరుగుబాటు చేసి తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూములు పంచారు. వెట్టి చాకిరిను విముక్తి చేశారని వారు అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి యాకూబ్ వంగూరు వెంకటేశ్వర్లు జిల్లా ఆఫీస్ బేరర్స్ కుంట ఉపేందర్ బాణాల రాజన్న నక్క సైదులు గొడిశాల వెంకన్న గంధసిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు