NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 7:43 pm Posted by : NAMASTHE BHARAT

బైరాగిగూడ ఓల్డ్ విలేజ్‌లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

బైరాగిగూడ ఓల్డ్ విలేజ్‌లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యలను పరిశీలించిన కమిషనర్ – త్వరలోనే పరిష్కరిస్తామని హామీ

నమస్తే భరత్ నవంబర్ 5 గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: గండిపేట మండలం, హైదర్షాకోట్ పరిధిలోని 123వ డివిజన్ బైరాగిగూడ ఓల్డ్ విలేజ్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు.
గత నెలలో స్థానిక డ్రైనేజీ సమస్యలపై కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కమిషనర్ గారు ఈరోజు ఏఈ రాజేష్ తో కలిసి బైరాగిగూడ ఓల్డ్ విలేజ్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థానికుల నుంచి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిశీలించిన అధికారులు వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపట్టి, సమస్యలను అతి త్వరలో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్, బోగాల శ్రీకాంత్, పలువురు పార్టీ నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
అధికారులు స్వయంగా కాలనీని సందర్శించి సమస్యలను పరిశీలించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.