పొలాల అమావాస్య సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద శుక్రవారం పొలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
పొలాల అమావాస్య సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు, నైవేద్య కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ముత్యాలమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, మహిళలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.