NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 8:25 pm Posted by : NAMASTHE BHARAT

హైదర్షాకోట్ 123 డివిజన్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – నూతన ఏఈ రమేష్

హైదర్షాకోట్ 123 డివిజన్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – నూతన ఏఈ రమేష్

నమస్తే భరత్ నవంబర్ 6| గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: హైదర్షాకోట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదర్షాకోట్ 123 డివిజన్, హిమాయత్ సాగర్ సెక్షన్ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీ రమేష్ గారు స్థానిక కాలనీలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమల హిల్స్, విద్యానగర్ ఫేజ్-2, ఇందిరానగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలలో పర్యటించి విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ఆయా కాలనీలలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా ఇందిరానగర్ కాలనీ, విద్యానగర్ ఫేజ్-2లో త్రీఫేస్ విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తక్షణమే మార్చాలని సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను స్వయంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన నూతన ఏఈ రమేష్ గారికి స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు హరీష్ గౌడ్, ఇందిరానగర్ కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్, శివకుమార్, నాగరాజు, యాదగిరి, రాజు, అంజన్ గౌడ్, వెంకటేష్ తదితరులతో పాటు విద్యుత్ శాఖ లైన్‌మెన్లు లక్ష్మణ్, మనోజ్ పాల్గొన్నారు.