NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 1:38 pm Posted by : NAMASTHE BHARAT

కార్మికకర్షిక గ్రామీణ పేదల కోసం నిరంతరం పోరాటం నడిపిన మహనీయుడు సీతారాం ఏచూరి

కార్మికకర్షిక గ్రామీణ పేదల కోసం నిరంతరం పోరాటం నడిపిన మహనీయుడు సీతారాం ఏచూరి

సిపిఎం మరిపెడ మండల ఆర్గనైజర్ బాణాల రాజన్న

నమస్తే భారత్ :-మరిపెడ

దేశంలో మత్తత శక్తులకు దోపిడి శక్తులకు వ్యతిరేకంగా కార్మిక కర్షక గ్రామీణ పేదల పక్షపాతిగా నిరంతరం పోరాటం సలిపిన మహనీయుడు సీతారాం ఏచూరి అని సిపిఎం మరిపెడ మండల ఆర్గనైజర్ బాణాల రాజన్న కొనియాడారు సెప్టెంబర్ 12న సీతారాం ఏచూరి రెండో వర్ధంతి మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించారు తాటికొండ అనంత చారి అధ్యక్షతన జరిగిన వర్ధంతిలో రాజన్న మాట్లాడుతూ నేడు దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయని ఇలాంటి సమయంలో ఏ చూరి గారి ఆశయాలు ఆయన చూపిన మార్గం ఎంతో అవసరమని ఆయన ఆశించిన విధంగా మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్యత కోసం ప్రజాస్వామ్యం సోషలిస్టు వ్యవస్థ కోసం పోరాటం చేయడమే నిజమైన ఆయనకిచ్చే నివాళి అని అన్నారు ఏచూరి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని కార్మిక కర్షక పోరాటాలు చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు తాటికొండ అనంత చారి ప్రజా సంఘాల నాయకులు పూల బోయిన వీరయ్య శ్రీనివాస్ బానోతు బద్రు గుగులోతు రామదాసు ఇస్లావత్ శీను సాయిబాబా ఉమేష్ లింగమూర్తి సైదులు బాలు తదితరులు పాల్గొన్నారు