NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 4:02 pm Posted by : NAMASTHE BHARAT

గణేష్ నగర్‌లో ఎస్ ఐ ఆర్-2026 హెల్ప్ డెస్క్‌ల ప్రారంభం.. ఓటర్లకు అండగా కాంగ్రెస్

గణేష్ నగర్‌లో ఎస్ ఐ ఆర్-2026 హెల్ప్ డెస్క్‌ల ప్రారంభం.. ఓటర్లకు అండగా కాంగ్రెస్

-చేరుకుపల్లి కాలనీలో హెల్ప్ డెస్క్‌లను ప్రారంభించిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి

-ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం

-ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని పిలుపు

-ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ

-మాజీ కార్పొరేటర్ కూన గౌరీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు

-కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు

కుత్బుల్లాపూర్, జూలై 24 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 284 గణేష్ నగర్ డివిజన్ పరిధిలోని చేరుకుపల్లి కాలనీలో ఏర్పాటు చేసిన ఎస్ ఐ ఆర్-2026 హెల్ప్ డెస్క్ కార్యక్రమాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ కూన గౌరీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్‌ల ద్వారా ఓటర్లకు ఎస్ ఐ ఆర్ -2026 ప్రక్రియపై అవగాహన కల్పించడం, అవసరమైన సమాచారాన్ని అందించడం, నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, SIR-2026 కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు అయ్యేలా హెల్ప్ డెస్క్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం, సహాయం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ నిబంధనల మేరకు సేవలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ఎం.డి. జాకీర్, గడ్డం రాజేందర్ రెడ్డి, ఖయ్యుమ్ పాషా, జెస్సీ, రమేష్, సురేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రామ్ చందర్తో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హెల్ప్ డెస్క్‌ల ద్వారా ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.