NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 3:27 pm Posted by : NAMASTHE BHARAT

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యాసంస్థల బంద్ విజయవంతం

*నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యాసంస్థల బంద్ విజయవంతం*

*కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి*

*ఏఐఎస్ఎఫ్ ,ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యుఐ, బీసీ జనసేన విద్యార్థి విభాగం*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 24:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సభ్యుడు ఆకాష్ నాయక్ , ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్,ఎన్ ఎస్ యు ఐ , బిలాల్ , బీసీ జనసేన విద్యార్థి విభాగం అఖిల్ ,పేర్కొన్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడం విద్యార్థుల ఆందోళనకు లభించిన మద్దతుకు నిదర్శనమని అన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధంగా పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమని విమర్శించారు.విద్యా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు సహకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలకు విద్యార్థి సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ ఉపాధ్యక్షులు అదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్,శివ రాంచరణ్, రోహిత్ సృజన్ ,వంశీ ,
రహన్ ,ప్రవీణ్ వికాస్ , ఏఐఎస్ఎఫ్ నాయకులు నూతన్ హర్షిత్, గణేష్, పవన్, సాయి చవాన్, మరియు విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.