NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 10:31 pm Posted by : NAMASTHE BHARAT

యువతకు స్వయం ఉపాధే బంగారు భవిష్యత్తుకు బాట

యువతకు స్వయం ఉపాధే బంగారు భవిష్యత్తుకు బాట

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

యువత,వ్యాపారవేతలు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్స్ స్వీట్ హౌస్,ప్రిన్స్ కిడ్స్ స్టూడియో, లక్ష్మీనరసింహ ఎంటర్ ప్రైజెస్ లను స్థానిక నాయకులు, ఆయా షాపుల నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలన్నారు. వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి మంచి ఆదరణ పొందాలని.ఆకాంక్షించారు.ఆయా షాపుల నిర్వాహకులు లవిశెట్టి రంజిత్, ఎండి సజ్జు, ఎండి.మసూద్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఖానాపురం సర్పంచ్ మై పాషా, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య,చిత్తలూరి శ్రీనివాస్,జాటోత్ రవి నాయక్, పేరటి యాకూబ్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి,దొంగరి శంకర్, మిత్తింటి హరీష్, వెలుగు మహేశ్వరి, బచ్చలి లక్ష్మణ్, మహేష్ యాదవ్, నరేందర్ నాయక్, భూతం భరత్,చంటి,పాషా తదితరులు పాల్గొన్నారు.