NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 3:17 pm Posted by : NAMASTHE BHARAT

సీప్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్కుమార్ ని రాజీనామా చేయాలని డిమాండ్

సీప్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్కుమార్ ని రాజీనామా చేయాలని డిమాండ్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ,రైతు సంఘం ,సిఐటియు .ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న మాట్లాడుతూ సర్ను వెంటనే తొలగించాలని 13 లక్షల నర ఓట్లని నమోదు చేయాలని సర్ జరిగిన తర్వాత జరిపిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని జ్ఞానేశ్ కుమార్ ని వెంటనే తొలగించి జరిగిన హవుక తౌకలని విచారించి ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని రాజన్న డిమాండ్ చేశారు ఢిల్లీలో నిలిపివేసిన మెట్రో రైళ్ల ను, ప్రజలకు అసౌకర్యం కలిగే చర్యలను అన్నిటిని వెనక్కి తీసుకోవాలని వాటిని రద్దు చేయాలని ఎడల గల్లీ నుంచి ఢిల్లీ దాకా జనాన్ని సమీకరించి రోడ్ల మీదికి ఎక్కి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య హరి భద్రమ్మ పెద్ద ఎంకన్న చిన్న వెంకన్న గురువయ్య సుభద్ర లచ్చమ్మ రాములమ్మ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు