శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు
శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు పాపన్నపేట, సెప్టెంబర్ 05:(నమస్తే భారత్) మండల కేంద్రంలోని శ్రీ విద్యా పాఠశాలలు ఉపాధ్యాయుల దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉత్తమ...