NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 10:12 pm Posted by : NAMASTHE BHARAT

ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సుల బహుకరణ సమ్మి గౌడ్

ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సుల బహుకరణ సమ్మి గౌడ్

* ఇచ్చిన మాట ప్రకారం కోలాటం డ్రెస్సులు అందించిన కేసముద్రం కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్

* కాళోజి నగర్ గణేష్ మిత్రమండలి ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమం

జెనిగల అనూష-అనిల్ కుమార్ శాశ్వత సౌండ్ సిస్టం (డీజే) బహుకరణ

* సమ్మయ్య గౌడ్ సహకారాన్ని అభినందించిన మిత్రమండలి సభ్యులు

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం.ఉప్పరపల్లి కాళోజి నగర్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సులను కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ బహుకరించారు. కాళోజి నగర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
గతేడాది గణేష్ ఉత్సవాలకు హాజరైన సమ్మయ్య గౌడ్.. ఆడబిడ్డలు కోలాటం ఆడుతుండటాన్ని చూసి వచ్చే ఏడాది కోలాటం డ్రెస్సులు అందిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఏడాది గడిచినా ఆ మాటను గుర్తుపెట్టుకుని, ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం డ్రెస్సులను బహుకరించారు. దీంతో ఆడబిడ్డలు, మిత్రమండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ.గతేడాది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేష్ ఉత్సవాల్లో భక్తి కార్యక్రమాలతో పాటు కోలాటం వంటి సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొంటూ మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడం అభినందనీయమని తెలిపారు.

“ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు”

కాళోజి నగర్ గణేష్ మిత్రమండలి కమిటీ సభ్యులు మాట్లాడుతూ.గతేడాది గణేష్ ఉత్సవాలకు వచ్చిన సందర్భంగా సమ్మయ్య గౌడ్ ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సులు అందిస్తానని చెప్పారని, ఈ ఏడాది అదే మాట ప్రకారం డ్రెస్సులు బహుకరించడం ఆనందంగా ఉందన్నారు. మాట ఇచ్చి మర్చిపోకుండా ఏడాది తర్వాత కూడా గుర్తుపెట్టుకుని నెరవేర్చడం.అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్సవాలకు అందించిన సహకారానికి సమ్మయ్య గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే జెనిగల అనూష–అనిల్ కుమార్ శాశ్వత సౌండ్ సిస్టం (డీజే)ను అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామి, ఉప సర్పంచ్ ఆవుల ఐలయ్య, కాళోజి నగర్ గణేష్ మిత్రమండలి అధ్యక్షులు ఆవుల రాజు (చందు), ఉపాధ్యక్షులు జెనిగల నరేష్, కార్యదర్శి గంగరబోయిన శ్రీను, కమిటీ సభ్యులు ఏర్పుల కృష్ణమూర్తి, జెనిగల నవీన్, ఆవుల సంతోష్, ఏర్పుల కుమారస్వామి, ఏర్పుల వెంకన్న, ఆవుల నవీన్, యాస వెంకట్రెడ్డి, కొమ్మనబోయిన రంజిత్, శాగంటి రాములు, గోనె మోహన్ రెడ్డి, మెండె రాకేష్, ఏర్పుల మహేష్, బోనగిరి యాకస్వామి, అల్లి రమేష్, నల్లగొండ ప్రభాకర్, ఆవుల శ్రీను, జెనిగల పిచ్చయ్య, బోనగిరి వీరయ్య, యానాల శ్రీను, జెనిగల వీరయ్య, నల్లగొండ సత్తయ్య, తోట బిక్షపతి, అల్లం శివ, జెనిగల కనకయ్య, ఆవుల కట్టయ్య, బోనగిరి రాగయ్య, నల్లగొండ మహేష్, మరాటి కొమురయ్య, బోనగిరి సారయ్య, ఏసల్ల సతీష్, ఆవుల కొమురయ్య, రాజు, యాకయ్య, సురేష్, సాయిలు, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.