NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:50 pm Posted by : NAMASTHE BHARAT

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట మరియు  రైతు ప్రజాపాట కార్యక్రమం 

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట మరియు రైతు ప్రజాపాట కార్యక్రమం


నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరిపెడ మరియు ఎల్లంపేట, మరియు నర్సింలపేట సెక్షన్ పరిధిలో ఈరోజు రైతులకు సంబంధించి సమస్యల పరిశీలన మరియు పరిష్కారం లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట మరియు రైతు ప్రజాపాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వారి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్యక్రమం లో భాగం గా ఈ మంగళవారం యల్లంపేట మరియు గుర్రపుతండా గ్రామాల లో నిర్వహించడం జరిగింది. గుర్రపుతండా లో రైతుల కొరకు ఏర్పాటు చేసిన 100 కె వీ ఆర్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించడం.జరిగింది.అదేవిధంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారి సమస్యలు వెంటనే పరిష్కరించడం జరుగుతుంది.అదే విధంగా వివిధ గ్రామాల్లో గాని పొలంలో గాని రైతులు సమస్యలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులు నేరుగా సంప్రదించి వారి యొక్క సమస్యలను పరిష్కారం.చేసుకోవచ్చు.అదేవిధంగా వారి సమస్య ల పరిష్కారం కొరకు 1912 నెంబర్ను సంప్రదించవచ్చు.ఈ కార్యక్రమం లో మరిపెడ సబ్ డివిజనల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాస్, మరిపెడ ఏఇ SD. మహమద్, యల్లంపేట ఏ ఇ ఎండీ. రూబీనా మరియు విద్యుత్ శాఖ సిబ్బంది వేమన, ఏకంతా చారి, మహేష్, వీరన్న రవీందర్ తదితరులు మరియు స్థానిక రైతు సోదరులు బానోతు వెంకన్న, మంగ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.