NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 9:09 pm Posted by : NAMASTHE BHARAT

కార్మిక కర్షక హక్కులను కాలరాస్తున్న పాలకులు

కార్మిక కర్షక హక్కులను కాలరాస్తున్న పాలకులు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ అబ్బాయిపాలెం గ్రామంలో జీపూ జాత ప్రారంభం సందర్భంగా, గుండ గాని మధుసూదన్ అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎందరో పోరాట యోధులు త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని, కార్మిక కర్షక హక్కులను, కేంద్రంలో ఉన్న బిజెపి.ప్రభుత్వం.కాలరాస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి వీరయ్య అన్నారు, లేబర్ కోళ్ల అమలుకు రూల్స్ నోటిఫై చేసింది, బడా పెట్టుబడి దారుల లాభాల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసింది, రోజువారి పని విధానాన్ని 8:00 గంటల నుండి 12:00 గంటల వరకు పెంచేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు, సమ్మె అక్కును కాలరాస్తూ ఆంక్షలు విధించారు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడారు, అనేక కంపెనీలలో కార్మికులను తొలగించేందుకు, ఐర్ మరియు ఫైర్ విధానాన్ని తీసుకువచ్చారు, విద్యుత్ ఉత్పత్తి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఉన్నది కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం 2025 విద్యుత్ సవర్ణ బిల్లును ఆమోదించుకున్నారు, ఈ చట్ట ప్రకారం, విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ, బాధ్యతలను కేంద్రమే ఆధీనంలోకి తీసుకున్నారు, దీనివల్ల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి, ఇక భవిష్యత్తులో ఉచిత విద్యుత్తు జీరో బిల్లులు అనేవి ఉండవు, ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున, కార్మికులు పేదలు రైతులు ఉద్యోగులు గ్రామీణ సేవకులు కదిలి వచ్చి జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్గనైజర్ బాణాలు రాజన్న సిఐటియు నాయకులు గుండ గాని మధుసూదన్, నందిపాటి వెంకన్న, కొండ ఉప్పలయ్య, కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చన్న, రైతు సంఘం నాయకులు తాటికొండ అనంత చారి, నలబోలు లక్ష్మారెడ్డి, యాస్క్ ఎస్కే షరీఫ్, బి సురేష్, పోలేపాక ప్రవళిక, పగిళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు