NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:44 pm Posted by : NAMASTHE BHARAT

*రైజింగ్ డే సందర్భంగా ఆర్‌పీఎఫ్ సేవా కార్యక్రమాలు*

*రైజింగ్ డే సందర్భంగా ఆర్‌పీఎఫ్ సేవా కార్యక్రమాలు*

*ప్రయాణికుల భద్రతపై ఆర్‌పీఎఫ్ అవగాహన*

*షాద్‌నగర్‌లో ఘనంగా ఆర్‌పీఎఫ్ రైజింగ్ డే*

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్20: షాద్‌నగర్‌: అఖిల భారత ఆర్ పి ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా షాద్‌నగర్‌లో ఆర్ పి ఎఫ్అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో పలు సామాజిక, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఎస్ ఐ/ఆర్ పి ఎఫ్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఏ ఎస్ ఐ/ఆర్ పి ఎఫ్ అబ్దుల్ ఖమర్‌తో పాటు కానిస్టేబుళ్లు జయవీర్, రాంపూజన్ సింగ్, W/కానిస్టేబుల్ సునీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్ పి ఎఫ్ కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం యోగా కార్యక్రమం నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, ప్రయాణ సమయంలో తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. దొంగతనాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే ఆర్ పి ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.ప్రయాణ సమయంలో ఏదైనా సహాయం అవసరమైనా, అత్యవసర పరిస్థితి ఎదురైనా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు సంప్రదించాలని ప్రయాణికులకు వివరించారు. అనంతరం షాద్‌నగర్‌లోని ఆర్ పి ఎఫ్ సిబ్బంది సందర్శించారు. అక్కడి నివాసులతో ఆత్మీయంగా మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆర్ పి ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో భాగంగా వారికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవాభావం, భద్రత, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి