NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 10:00 pm Posted by : NAMASTHE BHARAT

హర్ ఘర్ తిరంగా ర్యాలీతో మార్మోగిన రోడా మేస్త్రి నగర్

హర్ ఘర్ తిరంగా ర్యాలీతో మార్మోగిన రోడా మేస్త్రి నగర్

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి

దేశభక్తి ప్రతి గుండెలో నిండాలి: బీజేపీ నాయకుల పిలుపు

పటేల్, కృష్ణవేణి హైస్కూళ్ల వద్ద ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

కుత్బుల్లాపూర్, ఆగస్టు 12 ( నమస్తే భరత్ ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రోడా మేస్త్రి నగర్ 279వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. రోడా మేస్త్రి నగర్ డివిజన్ కోఆర్డినేటర్, నారాయణపేట జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఇన్‌చార్జ్ భానుచందర్ వర్మ ఆధ్వర్యంలో పటేల్ హైస్కూల్, కృష్ణవేణి హైస్కూల్ వద్ద ఈ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు డా. ఎస్. మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్, గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఇన్‌చార్జ్ చక్రధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో ఉండాలని, స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. “హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటా జాతీయ జెండా మాత్రమే కాదు.. ప్రతి గుండెలో దేశభక్తి నింపుకోవడం” అని పేర్కొన్నారు. ర్యాలీలో బీజేపీ గాజులరామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, ఓబీసీ మోర్చా జిల్లా ఆఫీస్ సెక్రటరీ వసుంధర, బీజేపీ లేబర్ సెల్ కో-కన్వీనర్ టి. రాము, బీజేవైఎం నాయకులు ఎం. మణి, రచ్చ చక్రధర్, పద్మ ప్రసాద్, సత్యనారాయణ, మురళీకృష్ణ, ఎల్.వి. రెడ్డి, నరేష్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పులి రాజు, మాణిక్య రెడ్డి, రామకృష్ణ, డి. కృష్ణ, మురళి గౌడ్, అఖిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే యువమోర్చా సభ్యులు భరత్, మంజునాథ్, విక్రమ్, సాయినాథ్ యాదవ్, కిరణ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం” నినాదాలతో రోడా మేస్త్రి నగర్‌లో దేశభక్తి వాతావరణాన్ని నెలకొల్పారు.

దేశభక్తి చాటిన త్రివర్ణ ర్యాలీ
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేసి దేశ సమైక్యత, సమగ్రత, దేశభక్తి భావాలను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలని నాయకులు కోరారు.