NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:03 pm Posted by : NAMASTHE BHARAT

పెరుగుతున్న ధరలు.. కుంగుతున్న పేదల బతుకులు – నిత్యావసర ధరలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి! సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.

పెరుగుతున్న ధరలు.. కుంగుతున్న పేదల బతుకులు – నిత్యావసర ధరలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి!

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.

నమస్తే భారత్ :-మరిపెడ

మండల కేంద్రంలోని గెస్ట్‌హౌస్‌లో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బియ్యం, చక్కెర, ఉల్లిగడ్డ, చెక్కరవల్లి గడ్డ, పప్పులు, వంటనూనెలు, కూరగాయల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఆదాయాలు పెరగకపోయినా నిత్యావసరాల ధరలు మాత్రం విపరీతంగా పెరగడం దుర్మార్గమన్నారు.
రైతు వద్ద తక్కువ ధరకు కొనుగోలు.చేసి.వినియోగదారుడికి అధిక ధరలకు విక్రయించే దళారీ వ్యవస్థను అరికట్టాలని, అక్రమ నిల్వలు, నల్లబజారుపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజలకు.అందుబాటులో ఉండే ధరలకు నిత్యావసర వస్తువులు లభించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, రైతు బజార్లు మరియు ప్రభుత్వ విక్రయ కేంద్రాలను విస్తరించాలని కోరారు.నిత్యావసర ధరలను వెంటనే నియంత్రించకపోతే సామాన్య ప్రజల పక్షాన సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని ఎండి అబ్దుల్ రషీద్ హెచ్చరించారు.