NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:57 pm Posted by : NAMASTHE BHARAT

ప్రజా సమస్యలపై స్పందించిన

ప్రజా సమస్యలపై స్పందించిన

కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో సీసీ రోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో స్థానిక ప్రజలు.కొంతకాలంగా.ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో కాలనీలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు.పడుతున్నారు.అదేవిధంగా రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను వెంటనే స్పందించారు.కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిశీలించిన అనంతరం సీసీ రోడ్డుపై నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లేలా అవసరమైన చర్యలు చేపట్టారు. నీటి నిల్వ సమస్యను పరిష్కరించడంతో ప్రస్తుతం కాలనీ ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తగ్గాయి.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి వెంటనే స్పందించి పరిష్కరించిన అనంతగిరి శ్రీనుకు సీతారాంపురం కాలనీ ప్రజలు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాలనీ.ప్రజలు.మాట్లాడుతూ.వర్షాలు కురిసిన సమయంలో రోడ్డుపై నీరు.నిలిచిపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవని, సమస్యను అనంతగిరి శ్రీను దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా కాలనీలోని ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు