ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: కూన శ్రీశైలం గౌడ్

-నివాసంలో ప్రజల నుంచి వినతిపత్రాల స్వీకరణ
-సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
-శుభకార్యాల ఆహ్వాన పత్రికలు అందజేసిన నాయకులు, ప్రజలు
-వినతులు, ఆహ్వానాలతో సందడిగా మాజీ ఎమ్మెల్యే నివాసం
కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, నాయకులు మంగళవారం ఆయన నివాసంలో కలిసి పలు ప్రజా, సామాజిక సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కూన శ్రీశైలం గౌడ్, సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తమ కుటుంబాల్లో జరగనున్న శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్యేకు అందజేసి, కార్యక్రమాలకు హాజరై ఆశీర్వదించాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.