విద్యుత్ లైన్ల భద్రత కోసం చెట్ల కొమ్మల తొలగింపు
జూన్ 20న రెండు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రమాదాల నివారణ, ప్రజల రక్షణే లక్ష్యం – టీజీఎస్పీడీసీఎల్
పేట్ బషీరాబాద్, జూన్ 19: ( నమస్తే భరత్ ); విద్యుత్ లైన్లకు అడ్డుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి, ప్రజల భద్రతను కాపాడడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రత్యేక లైన్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 20, 2026 (శనివారం) రోజున సంబంధిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ మీనాక్షి ఎస్టేట్స్ ఫీడర్ పరిధిలో నిర్వహించే పనుల కారణంగా మీనాక్షి ఎస్టేట్స్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, అంగడిపేట్, లయోలా కళాశాల పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ రామ్‌రాజ్‌నగర్ ఫీడర్ పరిధిలో చేపట్టే లైన్ క్లియరెన్స్ పనుల కారణంగా రామ్‌రాజ్‌నగర్ మొత్తం ప్రాంతం, ప్రపూర్ణ ఎన్‌క్లేవ్, ఫుద్నాని టవర్స్, ప్రగతి ప్రైడ్ అపార్ట్‌మెంట్స్, మై ఫ్రెండ్స్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనులు సజావుగా పూర్తయ్యేందుకు వినియోగదారులు సహకరించాలని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు కోరారు.