పినపాకలో నిబంధనలకు పాతర… గోదావరిని తోడేస్తున్న ఇసుక మాఫియా!
పినపాకలో నిబంధనలకు పాతర... గోదావరిని తోడేస్తున్న ఇసుక మాఫియా! పెద్దల అండతో రాత్రింబవళ్లు అక్రమ తవ్వకాలు – చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ గోదావరి నదిని భారీ యంత్రాలతో తోడేస్తున్న తీరు స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీరాపురం, జానంపేట–1, జానంపేట–2, సింగిరెడ్డిపల్లి, ఈ-బయ్యారం–1, ఈ-బయ్యారం–2 ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులు మంజూరైనప్పటికీ, వాటి నిర్వహణ...