NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 12:15 pm Posted by : NAMASTHE BHARAT

భక్తిశ్రద్ధల నడుమ పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం – విగ్రహ ప్రతిష్ఠాపన

భక్తిశ్రద్ధల నడుమ పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం – విగ్రహ ప్రతిష్ఠాపన

బోనాల నాటికి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చిన కమిటీ సేవలు ప్రశంసనీయం: మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్

జగద్గిరిగుట్ట, జూలై 2 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజీపురి కాలనీలో శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. తెలంగాణ సంస్కృతి, ముఖ్యంగా హైదరాబాద్ సంప్రదాయంలో బోనాల ఉత్సవాలకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. భగవంతుని ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందుతాయని అన్నారు.
రానున్న బోనాల ఉత్సవాల నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆలయ కమిటీ సభ్యుల సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ గుప్తా, శ్రీనివాస్, బాలు, శ్రీకాంత్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, బాబు, భాస్కర్, సునీల్ రెడ్డి, సంపత్ రెడ్డి, బసవేశ్వర్‌తో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.