NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 9:37 pm Posted by : NAMASTHE BHARAT

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి

*తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి*

*బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్ యాదవ్*

*షాద్ నగర్ పట్టణంలోని న్యూ సిటీ కాలనీలో జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన రవీందర్ యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్21:ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ షాద్‌నగర్ ఆధ్వర్యంలో పట్టణంలోని న్యూ సిటీ కాలనీలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్ యాదవ్ పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. జీవితాంతం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మేధావిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆశయాలను అమలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. జయశంకర్ కలలు కన్న స్వయం సమృద్ధి తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్, మాజీ పార్టీ అధ్యక్షులు నటరాజన్, లక్ష్మణ్ నాయక్, పద్మా రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు జిల్లెల వెంకట్ రెడ్డి, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు జి.టి వసంత శ్రీనివాస్, పిల్లి శారద శేఖర్, గౌస్ జానీ, గోపాల్, ఎస్పీ శివ, మాజీ కౌన్సిలర్లు జూపల్లి శంకర్, వెంకట్రాం రెడ్డి, కోస్గి శ్రీనివాస్, యుగంధర్, చింటూ, నంద కిషోర్, యాదగిరి, సర్పంచులు రాజు నాయక్, జెట్ట కుమార్, గిరి, మాజీ సర్పంచులు గోవిందు అశోక్, శ్రవణ్ పట్వారీ, పల్లె శ్రీనివాస్ రెడ్డి, జె.కె నర్సింలు, మాజీ ఎంపీటీసీలు బిశ్వ రామకృష్ణ, కాట్న శ్రీశైలం, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, చీపిరి రవి యాదవ్, సలీం, మల్చలం బిక్షపతి, కొమ్ము వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి, పాపయ్య, శంకరయ్య గౌడ్, భిక్షపతి, కుమార్ గౌడ్, వేణుగోపాల్, మన్నె మొగులయ్య, నరసింహా, జంగరాజ్, రాఘవేందర్, హరిక్రిష్ణ, మోహన చారి, కె. సత్యం, నర్సింలు, ఆంజనేయులు, ప్రభాకర్, శంకర్, పవన్ సింగ్, చీపిరి సాయి, దొడ్డి రవి, నవీన్, రాజు, శ్రీకాంత్, రాజశేఖర్, భీమ్ రెడ్డి, స్వామి, వినోద్, సుశాంత్, శ్రీను, రాం బాబు, రఘు, రమేష్, సంజు నాయక్, మోహన్ నాయక్, పరుషురాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.