NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 10:47 pm Posted by : NAMASTHE BHARAT

*రంగారెడ్డి జిల్లా ముస్లిం మైనారిటీ వింగ్ అధ్యక్షురాలిగా రషియా బేగం.*

*రంగారెడ్డి జిల్లా ముస్లిం మైనారిటీ వింగ్ అధ్యక్షురాలిగా రషియా బేగం.*

*తెలంగాణ రక్షణ సేనలో కీలక బాధ్యతలు.. కవితక్కకు కృతజ్ఞతలు తెలిపిన రషియా బేగం.*

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్01: తెలంగాణ రక్షణ సేన (తెరాస) రంగారెడ్డి జిల్లా ముస్లిం మైనారిటీ వింగ్ అధ్యక్షురాలిగా షాద్ నగర్ కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ జమీల్ పోస్ట్మాన్ కూతురు రషియా బేగం నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమెపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా రషియా బేగం హర్షం వ్యక్తం చేస్తూ కవితక్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం తనకు కేవలం పదవి మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. విద్యారంగంలో పనిచేస్తున్న తనకు విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమనే నమ్మకం ఉందన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువతకు విద్య, ఉపాధి, సామాజిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిజమైన ప్రజాసేవకురాలిగా పనిచేస్తానని వెల్లడించారు. మైనారిటీ కుటుంబాల అభ్యున్నతి, మహిళా సాధికారత, విద్యార్థుల భవిష్యత్తు, యువతకు మెరుగైన అవకాశాల కల్పన తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి సహకారంతో ఐక్యత, అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతానని రషియా బేగం తెలిపారు.