NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:52 pm Posted by : NAMASTHE BHARAT

ఉప్పరిగూడెంలో అభివృద్ధి జోరు.సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపనచేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

ఉప్పరిగూడెంలో అభివృద్ధి జోరు.సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపనచేసిన

పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

నమస్తే భారత్ :-పెద్దవంగర

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పరిగూడెం గ్రామంలో గ్రామాభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు పాలకుర్తి శాసన సభ్యురాలు యశశ్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా రూ.27 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడం, మహిళా సంఘాలకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ గ్రామీణ జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుంపలా శ్రీదేవి శ్యామ్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.