NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 10:27 pm Posted by : NAMASTHE BHARAT

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి: ఎమ్మెల్యే మురళీ నాయక్

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి:

ఎమ్మెల్యే మురళీ నాయక్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్ డెస్క్ ప్రారంభం.

నమస్తే భారత్ :-కేసముద్రం

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం & హెల్ప్ డెస్క్‌ను మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్.మాట్లాడుతూ.పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును.వినియోగించుకునేందుకు ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అవసరమైన పత్రాలతో నమోదు కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.

నాయకత్వం సమన్వయం తో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి- మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

సంజీవ రెడ్డి మాట్లాడుతూ నాయకత్వం సమన్వయం తో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని,ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి పట్టభద్రులందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు.రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ,శాసనసభ్యులు మురళీ నాయక్ అభివృద్ధికి పట్టం కట్టాలి – కేసముద్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్
మాట్లాడుతూ గత ఎన్నికలలో ఉన్న అనుభవాన్ని కలుపుకొని, కేసముద్రం మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను , మాజీ ప్రజా ప్రతినిధులను, కాంగ్రెస్ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో మన ప్రాంత అభివృద్ధి ప్రదాత,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,మహబూబాబాద్ శాసనసభ్యులు డా.మురళీ నాయక్ గతం లో లేని విధంగా వేల కోట్ల రూపాయల్తో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాన్ని ,దృష్టిలో పెట్టుకుని వారి నాయకత్వాన్ని బలపరుస్తూ, ప్రత్యర్ధులు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోకుండా ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి వేం అన్న కు,బహుమానంగా ఇవ్వాలని ఆయన అన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం & హెల్ప్ డెస్క్‌ ఎంపీ వేం నరేందర్ రెడ్డి క్యాంపు ఆఫీస్ నందు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పట్టభద్రులు సంప్రదించగలరు. అదే విదంగా వాట్సాప్ ద్వారా సంబంధిత పత్రాలు అనగా డిగ్రీ మెమో/ ప్రొవిజినల్
ఆధార్ కార్డు
ఓటర్ ఐడి
పాస్ ఫోటో
మొబైల్ నెంబర్
మెయిల్ ఐడి ని పంపించగలరు.
హెల్ప్ డెస్క్ నంబర్స్
9666666888,9703388007
కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, దస్రు నాయక్, ఆర్టిఏ మెంబెర్ రావుల మురళి,అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్,బానోత్ వెంకన్న,బండారి దయాకర్, బండారి వెంకన్న, కదిర సురేందర్,మునిసిపల్ కౌన్సిలర్లు వీరేష్,కిషోర్,బధ్యానాయక్ ,అయూబ్ ఖాన్,వసంత రావ్,సర్పంచులు,మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.