NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 11:19 am Posted by : NAMASTHE BHARAT

విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్

విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్

ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, ఆగస్ట్ 28,,శంషాబాద్ ఎస్ ఎఫ్ ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ కి, ఎస్ ఐ హర్షద్ అలీ కి ఎస్ ఎఫ్ఐ నాయకులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఆడపిల్లలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం

అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ, విద్య, సమాన అవకాశాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ ఎఫ్ ఐ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తున్న పోలీసులk సేవలను గుర్తు చేసుకుంటూ రక్షాబంధన్ సందర్భంగా పోలీసు అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపామని అన్నారు.రక్షాబంధన్ అంటే కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలోని మహిళలు, ఆడపిల్లలకు రక్షణ, భద్రత కల్పించే బాధ్యతను గుర్తుచేసే సందర్భంగా చూడాలని అన్నారు. విద్యార్థులను డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.మత్తు పదార్థాల ప్రభావం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటి నియంత్రణకు పోలీసులు చేస్తున్న కృషికి ఎస్ ఎఫ్ ఐ తరఫున పూర్తి సహకారం అందిస్తామని కేవై ప్రణయ్ తెలిపారు. విద్యార్థుల భద్రత, మహిళల రక్షణ కోసం ఎస్ ఎఫ్ ఐ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు సయ్యద్ సోహెల్, నిహారిక, శ్రావణి, కిరణ్, రుద్రాక్ష, సాయి, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.