NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 9:34 am Posted by : NAMASTHE BHARAT

దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ

దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

నమస్తే భారత్ :-తొర్రూరు

సామాన్యులు,పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచి అని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల,పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్.కట్.చేసి.శుభాకాంక్షలు.తెలుపుకున్నారు.ఈ సందర్భంగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ లతో కలిసి చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ అని పేర్కొన్నారు.గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో కీలక.శక్తిగా.అవతరించారన్నారు.లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అత్యంత బలీయ శక్తిగా ఉన్న బీజేపీని సమర్థంగా నిలువరించడంలో రాహుల్ చాలా వరకు సక్సెస్ అయ్యారని అభిప్రాయపడ్డారు.
ఆయన నాయకత్వం భవిష్యత్తులో దేశానికి అత్యంత అవసరమని తెలిపారు. దేశ భవిష్యత్తు ఆశాకిరణం రాహుల్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వెంకన్న యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ ముద్దసాని సురేష్,ఏఎంసీ డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండాల నర్సయ్య, చెవిటి సధాకర్,జక్కా మహబూబ్ రెడ్డి, రవీంద్ర చారి, దొంగరి శంకర్, రాజేష్ యాదవ్,సర్పంచ్లు బంగారు రమేష్, ఎర్ర వెంకటరెడ్డి,అభిరాం నాయక్, మాధవరెడ్డి,కవిత బాలకృష్ణ, గంగా నరేష్, సావిత్రి శ్రీనివాస్, యూత్ పట్టణ అధ్యక్షుడు మహేష్ యాదవ్, నాయకులు గూడెల్లి రామచంద్రయ్య,ఎనగందుల శ్రీనివాస్,చిన్న కోటయ్య, ప్రవీణ్ నాయక్,పరశురాములు, ఎర్రం రాజు తదితరులు పాల్గొన్నారు.