NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 5:55 pm Posted by : NAMASTHE BHARAT

నాణ్యమైన నేత్ర సంరక్షణ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలి

నాణ్యమైన నేత్ర సంరక్షణ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలి

చౌదరిగూడలో ‘అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్’ను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాద్ రావు

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 02:జిల్లేడు చౌదరిగూడ ప్రజలకు నాణ్యమైన నేత్ర పరీక్షలు, అత్యాధునిక కంటి అద్దాలు మరియు ఉత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉండడం ఎంతో అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాద్ రావు అన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక వైద్య సదుపాయాలు, ముఖ్యంగా నేత్ర సంరక్షణ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. కంటి ఆరోగ్యంపై ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని, చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని సూచించారు.
ప్రస్తుతం డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వినియోగం అధికంగా పెరిగిన నేపథ్యంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కంటి సమస్యలు పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో నాణ్యమైన సేవలు అందించే ఆప్టికల్స్ కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఉత్తమ సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.ఈ సందర్భంగా దుకాణం యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎదిర రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోనేరు శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బోయ కుర్మయ్య, చౌడాపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు బంధ్యయ్య రవితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించబడగా, స్థానిక ప్రజలు నూతనంగా ప్రారంభమైన ‘అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్’ ద్వారా నాణ్యమైన నేత్ర సేవలు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.