NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:05 pm Posted by : NAMASTHE BHARAT

24 గంటల నాణ్యమైన విద్యుత్ ని రైతాంగానికి సరఫరా చేయాలి – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

24 గంటల నాణ్యమైన విద్యుత్ ని రైతాంగానికి సరఫరా చేయాలి – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

నమస్తే భరత్,11/9/2026/ నారాయణపేట జిల్లా

మక్తల్ నియోజకవర్గంలోని జక్లేర్ హైవే రోడ్డు పైన నారాయణపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీ మన్తంగోడ్ వెంకట్రాములు గారి అధ్యక్షతన జరిగిన ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతాంగానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ ని సరఫరాచేయాలని, ఇప్పటికే ఆరుతడి పంటలు వేసుకున్న రైతులు వర్శ్యాలు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక నరక యాతన పడుతున్న రైతులకు బాసటగా నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు, అదికూడా లోవోల్టేజ్ కరెంట్ తో మోటార్లు కాలిపోయే విదంగా కరెంట్ సప్లై చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

తక్షణమే రైతాంగానికి నాణ్యమైన 24 గంటల కరెంటుని సరఫరా చేయాలనీ, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000/- రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీ బలరాంరెడ్డి గారు, ఉపాధ్యక్షులు శ్రీ కర్నె స్వామి గారు,కార్యదర్సులు శ్రీ హన్మంత్ గారు, శ్రీ కనకరాజు గారు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీ భరత్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గోవర్ధన్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ హన్మంత్ గారు,జిల్లా టెలికాం బోర్డు మెంబర్ శ్రీ పసుల నీరజ్ గారు,మండల అధ్యక్షులు శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, శ్రీ అజిత్ సింహా రెడ్డి గారు శ్రీ జయానంద్ రెడ్డి గారు, శ్రీ నల్లే నర్సప్ప గారు, వివిధ మోర్చాల మండల అధ్యక్షులు, కార్యదర్సులు, భూత్ అధ్యక్షులు పదాది కారులు పాల్గొన్నారు.