NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 10:38 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడలో వంద శాతం ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం

మరిపెడలో వంద శాతం ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం

* అంగన్‌వాడీ కేంద్రాల్లో వైద్యాధికారి పరిశీలన
* తప్పిపోయిన (మిస్ అయిన) పిల్లలను గుర్తించి చుక్కలు వేసిన సిబ్బంది
* మూడు రోజుల పాటు బస్టాండ్‌లోనూ పోలియో చుక్కల పంపిణీ

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్ పరిధిలో మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మూడవ రోజు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఐదేళ్లలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఏ ఒక్క.కూడా విడిపోకుండా పూర్తి లక్ష్యాన్ని సిబ్బంది అధిగమించారు
కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి డాక్టర్ రవి స్వయంగా అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, పిల్లలకు పోలియో చుక్కలు వేశారా లేదా అనే అంశాన్ని క్రాస్ చెక్ (పరిశీలన) చేశారు. ఈ పరిశీలనలో ఎక్కడైనా చుక్కలు వేయించుకోని (మిస్ అయిన) పిల్లలు ఉంటే, వారిని గుర్తించి అక్కడికక్కడే పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా.డాక్టర్.రవి.మాట్లాడుతూ.ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం గత మూడు రోజులుగా స్థానిక బస్టాండ్‌లో కూడా ప్రత్యేకంగా పల్స్ పోలియో కేంద్రాన్ని నిర్వహించి చుక్కలు వేసినట్లు వెల్లడించారు.
పాల్గొన్న వైద్య సిబ్బంది:ఈ ముగింపు కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ స్వామి, డాక్టర్ వెంకన్న, డాక్టర్ పూజిత, డాక్టర్ కిరణ్ ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. వారితో పాటు పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపర్‌వైజర్లు ఆచార్యులు, లలిత కుమారి, వెంకన్న, మాధవి చురుగ్గా పాల్గొన్నారు.అలాగే హెల్త్ అసిస్టెంట్లు వీరయ్య, నర్సయ్య, పల్లె దవాఖానా సిబ్బంది ఝాన్సీ, అఖిల, సతీష్, సరిత, అనిత, సౌజన్యలతో పాటు ఏఎన్‌ఎంలు మంజు వాణి, నాగమణి, ఝాన్సీ, రోజమణి, రాములమ్మ, విజయ, హుస్సేన్ బీ, కీర్తి లలిత, మహిబుబా, అశ్విని, స్వప్న, హరిశ మరియు ఆశా కార్యకర్తలు ఈ ఇంటింటి సర్వేలో పాల్గొని కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేశారు.