NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 10:36 pm Posted by : NAMASTHE BHARAT

అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర పర్వదినమును పులిహోర కార్యక్రమం 

అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర పర్వదినమును పులిహోర కార్యక్రమం

నమస్తే భారత్ :-మరిపెడ

ఆదివారం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్ర పర్వదినం సందర్భంగా శ్రీ స్వామి అయ్యప్పన్ అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో స్వాములు మరియు అన్నదాతల సహకారంతో పులిహోర వితరణ కార్యక్రమాన్ని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని నిర్వహించడం జరిగింది.దీనిలో.గురుస్వాములు వెన్నె నాగేశ్వరరావు గంధసిరి రమేష్ తల్లాడ అశోక్ కుమార్ వంగ నిరంజన్ రెడ్డి పిడియాల ఉపేందర్, ప్రసాద్ అన్వేష్ వంగవీటి భరత్ స్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గoదసిరి రమేష్ గురుస్వామి మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని పేర్కొన్నారు. ప్రతినెల అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర పర్వదినమును అన్నదానం మరియు సంఘసేవ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.