NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 11:26 am Posted by : NAMASTHE BHARAT

సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య పోచయ్య

సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య పోచయ్య

వరంగల్ జూలై2 (నమస్తే భారత్ ) :
దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా ( ఎఫ్ఏసి) ఆచార్య జీ. పోచయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీకేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన డాక్టర్ ఏ.ధర్మారెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందడంతో వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆచార్య. జి. పోచయ్యను సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఏసీ ( పూర్తి అదనపు బాధ్యతలు ) ప్రిన్సిపాల్ గా నియమిస్తూ కళాశాల ఉన్నత విద్య కమిషనర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు బుధవారం ఆచార్య జి.పోచయ్య బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపాల్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఆయేషా షేక్, డాక్టర్ కేఎల్వీ.వరప్రసాదరావు, లైబ్రేరియన్ ఎస్.అనిల్ కుమార్, కెప్టెన్ పి. సతీశ్ కుమార్, డాక్టర్ .వసుధ, ఎస్ .వెంకటేశ్వర్లు, సూపరెండెంటు జి. శ్రీనివాస్ , గెస్ట్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.