NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 11:14 am Posted by : NAMASTHE BHARAT

ప్రజావాణిలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం మేడ్చల్–మల్కాజిగిరి ఐడీఓసీలో 84 అర్జీలు స్వీకరణ

ప్రజావాణిలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం
మేడ్చల్–మల్కాజిగిరి ఐడీఓసీలో 84 అర్జీలు స్వీకరణ

-జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహణ

-ప్రజలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వినతుల స్వీకరణ

-ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపాలని అధికారులకు ఆదేశం

-అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టమైన సూచన

-ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపు

-ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించాలని అధికారులకు దిశానిర్దేశం

కుత్బుల్లాపూర్, జూలై 20 (విజన్ ఆంధ్ర); ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఐఏఎస్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) మాలతితో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సమస్యలు, వినతిపత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ ప్రజావాణిలో మొత్తం 84 అర్జీలు నమోదు కాగా, ప్రతి వినతిని కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.