NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:03 pm Posted by : NAMASTHE BHARAT

ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయం.. నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయం.. నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

➤ సీఎం సహాయనిధి ద్వారా రూ.2 లక్షల ఎల్ఓసీ పత్రం అందజేత

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిరంతరం కృషి చేస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీడిమెట్ల డివిజన్‌కు చెందిన నిరుపేద దరఖాస్తుదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను మంగళవారం చింతల్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా 132 జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డకు చెందిన అన్నబోయిన శాంత (భర్త: స్వర్గీయ మల్లేష్)కు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2,00,000 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా సహాయం అందేలా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత, సంక్షేమమే ఆయన ప్రజాసేవకు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, ఎల్లా గౌడ్, రాకేష్ జాలిగం, చంద్రశేఖర్ రెడ్డి, జయం చారి, డీజే రమేష్ తదితరులు పాల్గొన్నారు.