పట్టుబడిన వదలని మట్టి దందా
జేసీబీ, ట్రాక్టర్ ను సీజ్ చేసిన ఎఫ్‌ఆర్‌ఓ

ఖానాపురం జూన్ 27 (నమస్తే భారత్ ) :
నర్సంపేట నియోజకవర్గం
ఖానాపురం మండలంలో గత కొద్ధి నెలలుగా సాగుతున్న అక్రమ మట్టి తరలింపుపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములలో , ఫారెస్ట్ భూములలో ఇతర భూములలో మట్టి తరలిస్తూ వ్యాపారం సాగిస్తున్న పలువురిపై ఏప్రిల్ 20న ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేసి తహాశీల్థార్ ముందు బైండోవర్ చేశారు. నిందితులు మరోసారి అక్రమంగా మట్టి తరలించినట్లయితే భారీ మొత్తంలో అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది తమకేమి అవుతుందిలే అన్నట్లుగా గుట్టు చప్పుడు కాకుండా మట్టి దందా యధావిధిగా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఖానాపురం మండలం మనుబోతులగడ్డ సమీపంలోని బండమీది మామిడి తండా పరిధిలో ఉన్న ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతో నర్సంపేట ఎఫ్‌ఆర్‌ఓ నరేష్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగాఈనెల 20న బైండోవర్ ఐన వ్యక్తి ప్రశాంత్‌కు చెందిన జేసీబీ మట్టిని తవ్వుతున్నట్లు గుర్తించి జేసీబీ, ట్రాక్టర్ వాహనాలను సీజ్ చేసి నర్సంపేట ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. 20 జూన్ 2026న పీఓఆర్ నెం: 2390/48 కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. బైండోవర్ ఐన వ్యక్తులు మళ్ళి అదే పనిగా పదే పదే అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతుండడం ,పట్టుబడిన నిందితులపై జిల్లా ఉన్నతాధికారులు ఏలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో వేచి చూడాల్సిందే నని పలువురు అభిప్రాయపడుతున్నారు.