NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:55 pm Posted by : NAMASTHE BHARAT

వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. అబ్బాయిపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని దారావత్ తండా గ్రామపంచాయతీతో పాటు, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో ఈ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఈ శిబిరాల్లో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేశారు. అదేవిధంగా బీపీ, షుగర్, మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 180 మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దారావత్ తండా సర్పంచ్ దారావత్ తేజ, హెల్త్ సూపర్‌వైజర్ ఆచార్యులు, ఎం ఎల్ హెచ్ పి లు అనిత, సౌజన్య, ఏఎన్ఎం లు శ్రీదేవి, స్వప్న, ఆశా ఆరోగ్య కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.