మరిపెడ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డికి నివాళిఅర్పించి
కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ .
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి గుండెపోటుతో ఆకాల మరణం చెందడం పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆకస్మికంగా గుండెపోటుకు గురైన లక్ష్మారెడ్డి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ శనివారం మరిపెడలోని లక్ష్మారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ముందుగా లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ, దుబ్బాక లక్ష్మారెడ్డి మరణం మరిపెడ పట్టణానికి తీరని లోటని అన్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని, అందరితో కలివిడిగా ఉండే లక్ష్మారెడ్డి ఆకాల మరణం బాధాకరమన్నారు. ఆయన ఆత్మడు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని. ఏ అవసరం వచ్చినా ఆడుకుంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు మెరుగు రాము, జాటోతు సురెష్ పానుగోతు రాములు, తిరుపతి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ తాజోద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, నాయకులు కుడితి నర్సింహారెడ్డి, గుండగాని వేణు, షేక్ ఆస్టల్, బోడ రవి, ప్రమోద్, సర్వర్ పాషా, లచ్చిరామ్ తదితరులు పాల్గొన్నారు