హరిత ప్రతిజ్ఞతో పచ్చని భవిష్యత్తుకు బాటలు
-అవంతి నగర్ ఈస్ట్‌లో గోడపత్రిక ఆవిష్కరణ
-ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపు
-వర్షాకాలంలో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన
-పర్యావరణ పరిరక్షణే భావితరాలకు గొప్ప సంపద
-ప్రజల భాగస్వామ్యంతోనే హరిత విప్లవం సాధ్యం
-ప్రముఖులు, కాలనీ ప్రతినిధుల సమక్షంలో హరిత ప్రతిజ్ఞ
కుత్బుల్లాపూర్, జూలై 8 ( నమస్తే భరత్ ): పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తేనే భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని పర్యావరణ పరిరక్షణ చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో అవంతి నగర్ ఈస్ట్ కాలనీలో బుధవారం నిర్వహించిన హరిత ప్రతిజ్ఞ కార్యక్రమంలో గోడపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు హరితహార ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ చైర్మన్ బోయపాటి ఫణికుమార్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్‌పర్సన్ బాకారం బుచ్చయ్య, కిరణ్ కెపిఎల్ నాయుడు, ఎలంద రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అందరూ హరిత ప్రతిజ్ఞ చేసి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని సంకల్పించారు



