వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల అప్పగింత జాప్యంపై భగ్గుమన్న యజమానులు.. రోడ్డుపై బైఠాయింపు

*వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల అప్పగింత జాప్యంపై భగ్గుమన్న యజమానులు.. రోడ్డుపై బైఠాయింపు* నమస్తే భారత్:నిజాంపేట్ విలేకరి బాచుపల్లి పరిధిలోని 'వాసవి అర్బన్' ప్రాజెక్టులో ఫ్లాట్ల అప్పగింతలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కొనుగోలుదారులు కన్నెర్రజేశారు. గత మూడేళ్లుగా తమ సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్నా ఫ్లాట్లను అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాదాపు 1,800 మందికి పైగా ఫ్లాట్ యజమానులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించి నిరసన తెలిపారు. ​సకాలంలో ఇళ్లు అందిస్తారన్న నమ్మకంతో పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించినప్పటికీ, ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు...