మండల ప్రజావాణికి విశేష స్పందన
24 గంటల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ
ఖానాపురం ఆగష్టు18(నమస్తే భారత్ మల్లేష్ ) : మండల ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎంపీడీవో వనపర్తి అద్వైత ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా మండల విద్యా వనరుల కేంద్రం పరిధిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను మార్చాలని మండల విద్యాశాఖ అధికారులు వినతిని సమర్పించారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, 24 గంటల్లోపే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంతో స్థానికులు, అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు తక్షణ స్పందనతో చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.