గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి
విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ
ఖానాపురం సెప్టెంబర్ 12 (నమస్తే భారత్ ) :
గణేష్ మండపాల వద్ధ నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని ఎన్ పిడిసిఎల్ వరంగల్ జిల్లా ఖానాపురం మండల ఏఈ మంగమ్మ తెలిపారు. ఈసందర్బంగా ఎఈ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు పండుగ వాతావరణంలో సంతోషంగా ఉత్సహాంగా జరుపుకోవాలని కోరారు. ఏలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రదానంగా
వినాయక మండపాలను విద్యుత్ లైన్ల కింద గాని విద్యుత్ లైన్లకు ,ట్రాన్స్ఫార్మర్లకు దగ్గరగా ఏర్పాటు చేయకూడదన్నారు. మండపాల వైరింగ్ ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రిషియన్ ద్వారానే చేయించాలి ఎంసిబీఎస్ ఏర్పాటు చేయాలన్నారు.
వైరింగ్ లో ఎక్కడా జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నారు.
కనెక్ట్ అయిన లోడుకు సరిపోయే రేటెడ్ కేబుల్ వైర్లు, సరైన ఇన్సులేషన్ తో ఉపయోగించాలన్నారు.
సర్వీస్ కేబుల్స్ హుకింగ్ చేయరాదు.విద్యుత్ వైర్లు ఇనుప పైపులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతే తగిన ఇన్సులేషన్ పెట్టాలి.
వైర్లు నేలమీద వేయకుండా చూడాలి తప్పనిసరిగా వేయాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.సరైన ఎర్తింగ్ తో 3- పిన్ ప్లగ్ లు ఉపయోగించాలన్నారు.
మండపాల నిర్మాణంలో ఇనుప పైపులు వాడితే వాటిని ఇన్సులేషన్ పదార్థంతో కవర్ చేసేలా చూడాలి.సర్వీస్ వైరు పోలుకు ఫిక్స్ చేసిన తర్వాత సంబంధిత లైన మన్ గాని జెఎల్ ఎం అనుమతి లేకుండా మార్పులు చేయరాదు.
ఇన్వర్టర్ లేదా జనరేటర్ వాడితే రిటర్న్ కరెంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.అన్ని ఇన్స్టలేషన్లకు సరైన ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి
తడి చేతులతో స్విచ్లు ,స్విచ్ బోర్డులు లేదా ఏవైనా విద్యుత్ పరికరాలు తాకరాదు.పిల్లల భద్రత కోసం స్విచ్ బోర్డులను తగిన ఎత్తులో అమర్చాలి.
ప్రతి మండపంలో భద్రతా జాగ్రత్తలపై ఫ్లెక్సీలు , పోస్టర్లు ఏర్పాటు చేయాలి.మండపాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడానికి ముందు వైరింగ్ ను సంబంధిత సిబ్బంది పరిశీలించాలి.
ప్రతి మండపం ప్రవేశ ద్వారంలో ఎన్ పిడిసిఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912, సంబంధిత ఎఈ (ఆపరేషన్) మరియు లైన్ మన్, జెఎల్ ఎం ఫోన్ నంబర్లు రాయాలని సూచించారు.